’మనం’ స్టైల్లో మహేష్ తో ’శ్రీ శ్రీ ’

Sat,December 12, 2015 04:51 PM
mahesh plays a guest role in sri sri ?

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మనం మూవీ ఎంతటి సంచలన విజయం సాధించిందో మనందరికి తెలిసిందే. ఇందులో మూడు తరాల వారసులు కలిసి నటించగా ఇప్పుడు ఇదే స్టైల్లో మరో సినిమా తెలుగు సినీ పరిశ్రమలో రూపుదిద్దుకుంటున్నట్టు తెలుస్తోంది.

మనం మూవీలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య , అఖిల్ ఇలా మూడు తరాల వారసులు ఒకే తెరపై కనిపించి సందడి చేయగా, ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఇప్పుడు అదే స్టైల్లో శ్రీశ్రీ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ముప్పలనేని శివ ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో కృష్ణ, విజయనిర్మల జంటగా నటిస్తోండగా సుదీర్ బాబు తనయులు ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్టు ఇన్ సైడ్ న్యూస్ .

శ్రీశ్రీ చిత్ర దర్శకుడు ముప్పలనేని శివ ఈ చిత్రంలో మహేష్ తో ఓ గెస్ట్ రోల్ చేయించాలని భావిస్తున్నట్టు సమాచారం. గతంలో మహేష్ కూడా పలుమార్లు తన తండ్రి చిత్రంలో నటించాలని ఉంది అని తెలియజేయగా , శివ కృష్ణ సాయంతో మహేష్ ను సంప్రదించినట్టు తెలుస్తోంది. మరి మహేష్ కనుక ఈ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ చిత్రం మరో మనం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

1918
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles