సీఎంతో మ‌హేష్‌.. నెట్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్న ఫోటోలు

Tue,June 19, 2018 09:25 AM
mahesh pics goes viral

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఇటీవ‌లే త‌న ఫ్యామిలీతో విదేశీయాత్ర‌కి వెళ్ళి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. వ‌చ్చిన వెంట‌నే త‌న 25వ సినిమా ప‌నుల‌తో బిజీ అయ్యాడు. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో జ‌రుగుతుంది. చిత్ర హీరోయిన్ పూజా హెగ్డే కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటుంది. అయితే ఉత్తరాఖండ్‌లోనే మ‌హేష్ మూవీ షూటింగ్ జరుపుకుంటున్న విషయాన్ని తెలుసుకున్న ఆ రాష్ట్ర సీఎం త్రివేంద్ర సింగ్ రావత్.. సెట్స్ వద్దకు వెళ్లారు. సీఎం త్రివేంద్ర సింగ్ మహేశ్‌బాబును క‌లిసి స‌ర‌దాగా మాట్లాడారు. హీరోయిన్ పూజా హెగ్డే, ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి, నిర్మాత దిల్ రాజు సీఎంతో క‌లిసి ఫోటోలు దిగారు. ప్ర‌స్తుతం ఆ ఫోటోలు వైర‌ల్ అయ్యాయి.

మ‌హేష్ 25వ చిత్రంలో అల్ల‌రి నరేష్ కూడా ముఖ్య పాత్ర పోషించ‌నున్నాడు. మ‌హేష్ బాబు గొప్పింటి ధ‌న‌వంతుడిగా క‌నిపించ‌నుండ‌గా, అల్ల‌రి న‌రేష్ కుచేలుడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌. ముగ్గురు విద్యార్థులు.. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసేందుకు ఉత్తర భారతదేశ పర్యటనకు వెళ్లే కథాంశం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. రాజసం అనే టైటిల్‌ని చిత్రానికి ప‌రిశీలిస్తున్న‌ట్టు టాక్‌. దిల్‌రాజు, అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్ప‌టికే నాలుగు ట్యూన్స్ సిద్ధం చేసాడ‌ని స‌మాచారం.

2424
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS