పిరియాడిక్ డ్రామాతో సుక్కూ- మ‌హేష్ చిత్రం

Wed,October 17, 2018 12:05 PM
mahesh next with sukumar in periodical drama

రంగ‌స్థ‌లం చిత్రంతో భారీ హిట్ కొట్టిన సుకుమార్ .. అతి త్వ‌ర‌లో మ‌హ‌ర్షి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ మ‌హేష్ బాబుతో క‌లిసి ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. మ‌హేష్ 26వ చిత్రంగా రూపొంద‌నున్న ఈ మూవీని మైత్రి మూవీ మేక‌ర్స్ రూపొందించ‌నుంది . ఈ ప్రాజెక్ట్ కోసం సుకుమార్ ఏకంగా 15 కోట్ల రెమ్యున‌రేష‌న్ అందుకోబోతున్న‌ట్టు స‌మాచారం. ఇటీవ‌ల‌ ప్రీ ప్రొడ‌క్షన్ ప‌నులు మొద‌లు పెట్టిన‌ సుక్కూ 2019లో మూవీ విడుద‌ల చేయ‌నున్నాడట‌. సంగీత ద‌ర్శ‌కుడిగా మ‌రోసారి త‌న సినిమాకి దేవి శ్రీ ప్రసాద్‌ని ఎంపిక చేశాడ‌ని తెలుస్తుంది. ఇక ఈ ప్రాజెక్ట్ కోసం న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌ని కూడా ఎంపిక చేసే ప‌నిలో ఉన్నాడు సుకుమార్‌.

మ‌హేష్-సుకుమార్ కాంబినేషన్‌లో 1 నేనొక్క‌డినే చిత్రం తెరకెక్క‌గా, ఈ మూవీ అంత‌గా ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌లేక‌పోయింది. అయితే వీరిద్ద‌రి తాజా ప్రాజెక్ట్ స్వాతంత్య్రం త‌ర్వాత జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌తో ఉంటుంద‌ని స‌మాచారం. పీరియాడిక్ డ్రామాగా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం మంచి విజ‌యం సాధిస్తుంద‌నే న‌మ్మ‌కంతో టీం ఉంది. వంశీ పైడిప‌ల్లి చిత్రంతో బిజీగా ఉన్న మ‌హేష్ ఈ ప్రాజెక్ట్ పూర్తి కాగానే, సుకుమార్‌తో క‌లిసి ప‌ని చేయ‌నున్నాడు. ప‌క్కా స్క్రిప్ట్‌తోనే ఈ ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్ళేందుకు క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు మ‌న లెక్క‌ల మాస్టారు.

1473
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS