వైర‌ల్ అవుతున్న మ‌హేష్ న్యూ లుక్ ఫోటో

Sun,July 1, 2018 11:18 AM
mahesh new look goes viral

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో త‌న 25వ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. డెహ్రాడూన్‌లో తొలి షెడ్యూల్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం రాయ‌ల‌సీమ నేప‌థ్యంలో ఉంటుంద‌ని తెలుస్తుంది. ఇందులో మ‌హేష్ చాక్లెట్ బాయ్‌లా కాకుండా మీస‌క‌ట్టు, గ‌డ్డంతో ర‌ఫ్ లుక్‌లో క‌నిపించ‌నున్నాడ‌ని కొన్నాళ్ళుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో మ‌హేష్ త‌న ఫిట్‌నెస్ ట్రైన‌ర్‌తో క‌లిసి దిగిన ఫోటో ఒక‌టి ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో వైర‌ల్ ఉంది. ఇందులో మ‌హేష్‌ మీస‌క‌ట్టు , స్టైలిష్ గ‌డ్డంతో అందంగా క‌నిపిస్తుండ‌డంతో ఫ్యాన్స్ తెగ మురిసిపోయారు. ఇక తాజాగా మ‌హేష్ కోటు ధ‌రించి స్టైలిష్ హెయిర్ స్టైల్‌తో ఉన్న పిక్ సామాజిక మాధ్య‌మాల‌లో వైర‌ల్ అయింది . ఈ పిక్ ఫ్యాన్స్‌లో ఆనందాన్ని పీక్ స్టేజ్‌కి తీసుకెళుతుంది. దిల్ రాజు, అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలను సమకూర్చుతున్నారు. ఇక మూవీలో మరో విశేషం ఏంటంటే.. రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో నడిచే ఈ కథలో మహేష్‌కి స్నేహితుడిగా అల్లరి నరేష్ నటిస్తున్నాడు.

2965
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles