స‌రికొత్త లుక్‌లో మ‌హేష్ .. ఫోటో వైర‌ల్‌

Thu,June 28, 2018 12:07 PM
mahesh new look goes viral

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో త‌న 25వ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. డెహ్రాడూన్‌లో తొలి షెడ్యూల్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం రాయ‌ల‌సీమ నేప‌థ్యంలో ఉంటుంద‌ని తెలుస్తుంది. ఇందులో మ‌హేష్ చాక్లెట్ బాయ్‌లా కాకుండా మీస‌క‌ట్టు, గ‌డ్డంతో ర‌ఫ్ లుక్‌లో క‌నిపించ‌నున్నాడ‌ని కొన్నాళ్ళుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో మ‌హేష్ త‌న ఫిట్‌నెస్ ట్రైన‌ర్‌తో క‌లిసి దిగిన ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ ఉంది. ఇందులో మ‌హేష్‌ మీస‌క‌ట్టు , స్టైలిష్ గ‌డ్డంతో అందంగా క‌నిపిస్తున్నాడు . ఈ పిక్ ఫ్యాన్స్‌లో ఆనందాన్ని పీక్ స్టేజ్‌కి తీసుకెళుతుంది. దిల్ రాజు, అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలను సమకూర్చుతున్నారు. ఇక మూవీలో మరో విశేషం ఏంటంటే.. రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో నడిచే ఈ కథలో మహేష్‌కి స్నేహితుడిగా అల్లరి నరేష్ నటిస్తున్నాడు.

మ‌హేష్ 25వ చిత్రం ముగ్గురు విద్యార్థులు.. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసేందుకు ఉత్తర భారతదేశ పర్యటనకు వెళ్లే కథాంశం నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. రైతుల రుణాలు, వాళ్ళ బీద పరిస్థితులను ప్రధానంగా సినిమాలో ప్రస్తావించడం జరుగుతుందని, అలాగే సినిమా రైతుల్లో కొత్త ఉత్తేజం నింపే తరహాలో ఉంటుందని స‌మాచారం. రాజసం అనే టైటిల్‌ని చిత్రానికి ప‌రిశీలిస్తున్న‌ట్టు టాక్‌. పూజా హెగ్డే చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. సామాజిక క‌థాంశంతో మ‌హేష్ తీసిన చిత్రాలు అన్ని మంచి విజ‌యం సాధించ‌డంతో ఈ సినిమా కూడా త‌ప్ప‌క స‌క్సెస్ సాధిస్తుంద‌ని చెబుతున్నారు.

2559
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles