మ‌హేష్ 'మ‌హ‌ర్షి' రిలీజ్ డేట్ లాక్ చేసిన నిర్మాత‌లు

Wed,February 27, 2019 12:39 PM

భ‌ర‌త్ అనే నేను వంటి సూప‌ర్ హిట్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన మ‌హేష్ ప్ర‌స్తుతం మ‌హ‌ర్షి చిత్రంతో బిజీగా ఉన్నాడు. మ‌హేష్ 25వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుంది. ఏప్రిల్ 26న చిత్రం రిలీజ్ కానుంద‌ని అప్ప‌ట్లో ప్ర‌క‌టించ‌గా, ఇటీవ‌ల ఆ డేట్ కూడా మారొచ్చ‌నే టాక్స్ వినిపించాయి. తాజాగా చిత్ర నిర్మాత‌లు మార్చి 15 నాటికి రెండు పాట‌లు మిన‌హా షూటింగ్ అంతా పూర్తవుతుందని అన్నారు. మ‌రోవైపు శ‌ర‌వేగంగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ని కూడా జ‌రుపుతున్న‌ట్టు తెలిపారు. ఏప్రిల్ 25న చిత్రం రిలీజ్ కావ‌డం ఖాయం అని అంటున్నారు. హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రంలో మహేష్ మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో నటించనున్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన 5 మందిలో ఒకడిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. కార్పోరేట్ అధిపతిగా యూఎస్ నుండి తిరిగివచ్చి వ్యవసాయంలో రైతులకు సరికొత్త విధానాన్ని అందించే పాత్రలో కనిపించబోతున్నారట మహేష్. దిల్ రాజు, అశ్వినీదత్ , పీవీపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అల్ల‌రి నరేష్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.1675
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles