ఎన్టీఆర్ విష‌యంలో వ‌స్తున్న వార్త‌లు అవాస్తవం

Tue,June 5, 2018 09:58 AM
mahesh koneru condense the rumors

కొద్ది రోజులుగా ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించిన ఓ వార్త టాలీవుడ్‌లో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ఎన్టీఆర్ భార్య ప్ర‌ణ‌తి ప్ర‌స్తుతం గ‌ర్భిణీ కాగా, ఆమె బాగోగులు చూసుకునేందుకే ఎన్టీఆర్ బిగ్ బాస్ 2 కూడా చేయ‌ట్లేద‌ని వార్త సారాంశం. దీనిపై ఓ అభిమాని ఎన్టీఆర్ పీఆర్ మ‌హేష్ కోనేరుకి ట్వీట్ చేశాడు. ఇదంతా అవాస్త‌వం అంటూ ఆయ‌న క్లారిటీ ఇచ్చారు. దీంతో అభిమానుల‌లో అనుమానాలు తొల‌గిపోయాయి. కాని ఆ మ‌ధ్య జరిగిన ఓ ఫంక్ష‌న్‌లో ప్ర‌ణతి బేబి బంప్‌తో క‌నిపించ‌గా, ఆ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కూడా అయ్యాయి. దీనిపై క్లారిటీ రావ‌డం లేదు. ఎన్టీఆర్‌కి అభయ్ అనే నాలుగేళ్ళ కుర్రాడు ఉన్న సంగ‌తి తెలిసిందే.

ఎన్టీఆర్ ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ తెర‌కెక్కిస్తున్న అర‌వింద స‌మేత అనే చిత్రం చేస్తున్నాడు . రాయ‌ల‌సీమ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో రాఘ‌వ పాత్ర‌లో ఎన్టీఆర్ క‌నిపిస్తాడ‌ని, అర‌వింద పాత్ర‌లో పూజా హెగ్డే సంద‌డి చేయ‌నుంద‌ని స‌మాచారం. చిత్రానికి సంబంధించి ఇటీవ‌ల ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కాగా ఇందులో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్‌లో కనిపించి అభిమానులకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. పూజా హెగ్డే ఇందులో కథానాయిక‌గా న‌టిస్తుంది. కాజ‌ల్ ప్ర‌త్యేక గీతంలో న‌ర్తించ‌నుంద‌ని అంటున్నారు . ప్ర‌స్తుతం మూడో షెడ్యూల్ జ‌రుపుకుంటుంది ఈ చిత్రం.


7289
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles