దుబాయ్‌లో న్యూ ఇయ‌ర్ వేడుక‌లు జ‌రుపుకోనున్న మ‌హేష్

Sat,December 29, 2018 10:00 AM
Mahesh Is Celebrating The New Year in dubai

సౌత్ స్టార్ హీరో మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ మ‌హ‌ర్షి అనే సినిమాతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం వ‌చ్చే నెల‌లో రాజ‌మౌళి ఫిలీం సిటీలో మ‌రో షెడ్యూల్ జ‌ర‌పుకోనుంది. అయితే ప‌లు అకేషన్స్‌కి ఫారెన్ ట్రిప్ వేసే మ‌హేష్ బాబు ఈ ఏడాది న్యూ ఇయ‌ర్ వేడుక‌లు జ‌రుపుకొనేందుకు దుబాయ్ వెళ్ళాడు. అక్క‌డ త‌న ఫ్యామిలీ అంద‌రితో స‌ర‌దాగా గడుపుతున్నాడు. ఓ హోట‌ల్‌లో మ‌హేష్ ఫ్యామిలీ స‌ర‌దా టైంని స్పెంట్ చేస్తుండ‌గా, దానికి సంబంధించిన ఫోటోని న‌మ‌త్ర త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.ఈ పిక్ మ‌హేష్ అభిమానుల‌ని అల‌రిస్తుంది. మ‌రో వైపు మ‌హేష్ సేవాపన్నును ఎగవేస్తున్నారని, ఆయన ఖాతాలను స్తంభింపజేయాలని పేర్కొంటూ హైదరాబాద్ సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ వివిధ బ్యాంకులను ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన న్యాయవాదుల బృందం క్రమశిక్షణ కలిగిన, చట్టాలను గౌరవించే సినీనటుడు మహేశ్‌బాబు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను బకాయిలేమీ లేవని వెల్ల‌డించ‌డం విశేషం

1417
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles