కేరళ వరద బాధితులకు సూపర్ స్టార్ సాయం

Sun,August 19, 2018 08:57 AM
mahesh helps to kerala victims

గ‌త కొద్ది రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల‌కి కేర‌ళ రాష్ట్రం వ‌ణికిపోతుంది. భారీ వ‌ర్షాల‌తో రోడ్ల‌న్నీ న‌దుల‌ని త‌ల‌పిస్తున్నాయి. జ‌న‌జీవ‌నం అస్త‌వ్య‌స్తం అయింది. ఆర్మీ వ‌ర‌దల‌లో చిక్కుకున్న వారిని సుర‌క్షిత ప్ర‌దేశానికి త‌రిలించేందుకు ప్రాణం ఒడ్డి ప్ర‌య‌త్నిస్తుంది. భారీ వ‌ర్షాల వ‌ల‌న ఎంద‌రో నిరాశ్ర‌యులు కాగా, వారిని ఆదుకునేందుకు అన్ని రాష్ట్రాల‌కి చెందిన ప్ర‌ముఖులు, సినీ సెల‌బ్రిటీలు ముందుకొస్తున్నారు. రీసెంట్‌గా మా కేరళ ప్రజలకు తమవంతు సాయంగా రూ.10లక్షలు విరాళం ఇచ్చారు. మెగా ఫ్యామిలీకి సంబంధించి చిరు, రామ్ చ‌ర‌ణ్‌లు కూడా విరాళం ఇవ్వ‌గా, సూప‌ర్ స్టార్ మ‌హేష్ కేర‌ళ వ‌ర‌ద బాధితుల‌కి 25 ల‌క్ష‌ల ఆర్థిక సాయం ఇవ్వ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. మ‌హేష్‌కి కేర‌ళలోను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విష‌యం విదిత‌మే. ప్ర‌స్తుతం మ‌హ‌ర్షి అనే సినిమాతో బిజీగా ఉన్నాడు మ‌హేష్‌. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తుంది.

6020
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles