ఉగాదికి 'మహ‌ర్షి' గిఫ్ట్

Thu,April 4, 2019 08:40 AM

టాలీవుడ్ సినీ ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న చిత్రం మ‌హ‌ర్షి. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన ఈ చిత్రం మే 9న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇటీవ‌ల ఈ చిత్రం నుండి ఛోటీ ఛోటీ బాతే అనే పల్లవితో మొదలయ్యే పాట విడుద‌ల చేశారు. ఈ సాంగ్ సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అలరించింది. ఇక ఏప్రిల్ 6న ఉగాది కానుకగా చిత్ర టీజ‌ర్ విడుదలకానుంది సమాచారం. ఇప్పటికే మహేష్ దానికి సంబందించిన డబ్బింగ్ కూడా కంప్లీట్ చేశార‌ట‌. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. పీవీపీ, అశ్వనీద‌త్‌, దిల్ రాజు సంయుక్తంగా మ‌హ‌ర్షి చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా, ఇందులో పూజా హెగ్డే కథానాయిక‌గా న‌టిస్తుంది. అల్ల‌రి న‌రేష్ .. మ‌హేష్ స్నేహితుని పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఈ మూవీ చిత్రీక‌ర‌ణ తుదిద‌శ‌కు చేరుకోగా, వేగ‌వంతంగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుతున్నారు. వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం మ‌హేష్‌కి మంచి విజ‌యం అందించ‌డం ఖాయ‌మ‌ని అభిమానులు అంటున్నారు.

2286
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles