సుకుమార్‌తో సినిమాపై మ‌హేష్ క్లారిటీ..!

Fri,January 11, 2019 01:25 PM

లెక్క‌ల మాస్టారు సుకుమార్ రంగ‌స్థ‌లం అనే చిత్రంతో భారీ హిట్ కొట్ట‌గా ఆయ‌న త‌దుప‌రి సినిమా ఎవ‌రితో ఉంటుంద‌నే దానిపై అభిమానుల‌లో అనేక సందేహాలు నెల‌కొన్నాయి. ముందుగా మ‌హేష్‌తో పీరియాడిక్ డ్రామా చేస్తాడ‌ని వార్త‌లు రాగా, సూప‌ర్ స్టార్ హిస్టారిక‌ల్ స‌బ్జెక్ట్‌పై అంత‌గా ఆస‌క్తి చూప‌క‌పోవ‌డంతో ప్రాజెక్ట్ వాయిదా ప‌డింది. దీంతో సుకుమార్ ఓ థ్రిల్ల‌ర్ స‌బ్జెక్ట్‌ని సిద్ధం చేసి మ‌హేష్‌కి వినిపించ‌గా, ఆ క‌థ‌కి మ‌హేష్ ఫిదా అయ్యాడ‌ట‌. దీంతో ఫుల్‌బౌండ్ స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నాడు మ‌న స్టార్ డైరెక్టర్. అయితే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా, దీనిపై మహేష్ చిన్న క్లారిటీ ఇచ్చాడు.


సుకుమార్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా త‌న ట్విట్ట‌ర్‌లో ఇద్ద‌రు క‌లిసి ఉన్న ఫోటోని షేర్ చేస్తూ టాలెంటెడ్‌, హంబుల్ ప‌ర్స‌న్ సుకుమార్‌కి బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు. మ‌న సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను అని కామెంట్ పెట్టారు మ‌హేష్‌. దీంతో మ‌హేష్ 26వ సినిమాపై ఓ క్లారిటీ వచ్చింది. దేవి శ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతం అందించ‌నున్నారు. ఈ మూవీని మైత్రి మూవీ మేక‌ర్స్ రూపొందించ‌నున్నారు. మ‌హేష్-సుకుమార్ కాంబినేషన్‌లో వ‌చ్చిన‌ 1 నేనొక్క‌డినే అంత‌గా అలరించ‌క‌పోగా, త్వ‌ర‌లో రానున్న చిత్రం ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ హిట్ కొడుతుంద‌ని అభిమానులు భావిస్తున్నారు.


2109
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles