మ‌హేష్ అభిమానుల‌లో టెన్ష‌న్‌.. కారణం ఏంటో తెలుసా ?

Sun,March 10, 2019 08:13 AM

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోల‌లో ఒక‌ర‌నే సంగ‌తి తెలిసిందే. ఆయ‌న సినిమా కోసం అభిమానులు క‌ళ్ళ‌లలో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూస్తున్నారు. ప్ర‌స్తుతం వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హ‌ర్షి అనే చిత్రం చేస్తున్న మ‌హేష్ ఈ చిత్రాన్ని మే9న ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ముందుగా ఏప్రిల్‌లో రిలీజ్ చేస్తామ‌ని చెప్పిన చిత్ర బృందం మేలో రిలీజ్ అనే స‌రికి మ‌హేష్ అభిమానుల‌లో టెన్ష‌న్ మొద‌లైంది. అందుకు కార‌ణం మహేష్ నటించిన డిజాస్టర్ చిత్రాలు నాని , నిజం , బ్రహ్మోత్సవం మేలో రిలీజ్ అయ్యాయి. దీంతో మ‌హేష్‌కి మే నెల అచ్చిరాద‌ని అభిమానులు అభిప్రాయ ప‌డుతున్నారు.


కాని చిత్ర నిర్మాత‌లు మాత్రం మేలో వ‌స్తున్న మ‌హ‌ర్షి మాత్రం మంచి హిట్ అవుతుంద‌ని అంటున్నారు. అశ్వినీదత్ నిర్మించిన జగదేకవీరుడు అతిలోకసుందరి, మహానటి మే 9th వచ్చాయి. అలానే దిల్ రాజు బ్యానర్ లో పరుగు, భద్ర కూడా మే లో వచ్చాయి. ఈ సినిమాల‌న్నీ భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించాయి. ఈ క్ర‌మంలో మేలో విడుద‌ల కానున్న మ‌హ‌ర్షి చిత్రం కూడా భారీ హిట్ కొడుతుంద‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. మరి ఇక్క‌డ మ‌హేష్ సెంటిమెంట్ వ‌ర్కవుట్ అవుతుందా లేదంటే నిర్మాత‌ల సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అవుందా అనేది చూడాలి. మ‌హ‌ర్షి చిత్రాన్ని దిల్ రాజు, అశ్వినీదత్ , పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు.

3265
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles