థ్యాంక్యూ మై ల‌వ్ : మ‌హేష్

Sun,April 22, 2018 07:15 AM
mahesh express her love with wife

సూప‌ర్ స్టార్‌ మ‌హేష్ బాబు భ‌ర‌త్ అనే నేను చిత్రంతో భారీ విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్ర విజ‌యంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. రెండు ప‌రాజ‌యాల త‌ర్వాత భారీ విజ‌యాన్ని సాధించిన మ‌హేష్ కూడా ప్ర‌స్తుతం ఆ స‌క్సెస్‌ని త‌న ఫ్యామిలీతో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు. విడుదలైన అన్ని రాష్ట్రాల‌లో చిత్రం మంచి టాక్‌తో దూసుకెళుతుండ‌గా, మ‌హేష్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌కి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌తలు తెలిపాడు. త‌న స‌తీమ‌ణికి లిప్‌లాక్ ఇస్తున్న ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ థ్యాంక్యూ మై ల‌వ్ అంటూ న‌మ్ర‌త‌కి ప్ర‌త్యేక‌ కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు మ‌హేష్‌. ఈ ఫోటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. భ‌ర‌త్ అనే నేను చిత్రం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌గా, ఇందులో కైరా అద్వానీ క‌థానాయిక‌గా న‌టించింది. ఫిక్ష‌న్ నేప‌థ్యంలో సాగే ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ళ ప్ర‌భంజ‌నం సృష్టిస్తుంది.


Thankyou my love ❤

A post shared by Mahesh Babu (@urstrulymahesh) on

7174
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles