24 రోజుల షెడ్యూల్ ముగించిన మ‌హేష్ బాబు

Wed,July 11, 2018 01:15 PM
mahesh completes new schedule

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు త‌న 25వ చిత్రంగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దిల్ రాజు, అశ్వినీద‌త్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం కొన్నాళ్ళుగా డెహ్ర‌డూన్‌లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. 24 రోజుల పాటు జ‌రిగిన షెడ్యూల్ పూర్తైంద‌ని చిత్ర నిర్మాణ సంస్థ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించింది. కాస్త బ్రేక్ త‌ర్వాత మ‌రో షెడ్యూల్ కోసం అమెరికా వెళ్ల‌నుంది చిత్ర బృందం. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు. ఏప్రిల్‌5 ,2019న విడుద‌ల కానున్న ఈ చిత్రంలో అల్ల‌రి న‌రేష్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ర‌వి అనే పాత్ర‌లో మ‌హేష్ క్లోజ్ ఫ్రెండ్‌గా క‌నిపించ‌నున్నాడ‌ట‌. ముగ్గురు విద్యార్థులు.. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసేందుకు ఉత్తర భారతదేశ పర్యటనకు వెళ్లే కథాంశం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. చిత్రంలో మహేష్ విద్యార్థిగా, యూఎస్ కంపెనీ సీఈవోగా కనిపించనున్నారు. రాజ‌సం అనే టైటిల్‌ని ఈ చిత్రానికి ప‌రిశీలిస్తుండగా, త్వ‌ర‌లోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది.2274
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles