మహేశ్‌ బాబు మైనపు విగ్రహం ఆవిష్కరణ

Mon,March 25, 2019 11:31 AM
Mahesh Babu Wax Figure Launch

హైదరాబాద్‌: కొండాపూర్‌లోని ఏఎంబీ సినిమాస్‌ మల్టిప్లెక్స్‌లో సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. సినీ ఇండస్ట్రీలో మహేశ్‌కు ఉన్న పాపులారిటీ గుర్తించిన మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియం నిర్వహకులు సూపర్‌ స్టార్‌ మైనపు విగ్రహాన్ని తయారు చేసింది. అయితే మహేశ్‌ అభిమానుల కోసం ఈ మైనపు విగ్రహాన్ని ముందుగా నగరంలోని ఏఎంబీ సినిమాస్‌లో ఆవిష్కరించారు. తర్వాత సింగపూర్‌ మ్యూజియంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు అభిమానులు ఈ మైనపు బొమ్మతో సెల్ఫీ దిగే అవకాశం కల్పించారు. ఇలాంటి కార్యక్రమం తర్వాత విగ్రహాన్ని తరలించడం మేడమ్‌ టుస్సాడ్స్‌ చరిత్రలోనే మొదటిసారి కావడం విశేషం. ఈ కార్యక్రమంలో మహేశ్‌ బాబుతో పాటు ఆయన కుటుంబసభ్యులు, మ్యూజియం ప్రతినిధులు, సన్నిహితులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

1897
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles