‘మీకు మాత్ర‌మే చెప్తా’ ట్రైలర్ వచ్చేసింది

Wed,October 16, 2019 06:47 PM

పెళ్లి చూపులు డైరెక్ట‌ర్ తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తోన్న చిత్రం మీకు మాత్రమే చెప్తా. ష‌మీర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ను మహేశ్ బాబు విడుదల చేశాడు. ‘మన లైఫ్ మన చేతులో ఉందో లేదో గానీ, మనందరి చేతిలో ఖచ్చితంగా ఫోన్ ఉంటుంది’ అంటూ వెన్నెల కిశోర్ చెప్పే డైలాగ్స్ తో ప్రారంభమయ్యే ట్రైలర్ వినోదాత్మకంగా..కొద్దిగా సస్పెన్స్ గా సాగుతుంది. తరుణ్ భాస్కర్ న్యూలుక్ లో మెస్మరైజ్ చేస్తున్నాడు. ట్రైలర్ చూస్తుంటే అభిమానులకు మంచి వినోదాన్ని అందించడం ఖాయమనిపిస్తోంది.


విజ‌య్ దేవ‌ర‌కొండ తొలిసారి నిర్మాత‌గా మారి మీకు మాత్ర‌మే చెప్తా అనే సినిమాని నిర్మిస్తున్నారు. అవంతికా మిశ్రా క‌థానాయిక‌గా న‌టిస్తుంది. అభినవ్ గోమటం, నవీన్ జార్జ్ థామస్, అనసూయ, వాణి భోజన్, పావని గంగిరెడ్డి కీలక పాత్రల్లో నటించారు. సినిమాను నవంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ట్రైలర్ ఆసక్తికరంగా, వినోదాత్మకంగా ఉంది. యువ చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ అని మహేశ్ బాబు ట్వీట్ చేశాడు.




1081
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles