సోషల్ మీడియాలో టాప్ ప్లేస్‌లో మహేష్ బాబు

Sun,July 22, 2018 06:02 PM
Mahesh Babu tops in social media followers ranking

వైవిధ్యభరితమైన కథాంశం ఉన్న సినిమాలలో నటించడమే కాదు, అటు అభిమానులను సంపాదించుకోవడంలోనూ నటుడు మహేష్ బాబు ముందున్నాడు. ప్రస్తుతం అన్ని సోషల్ మాధ్యమాల్లో కలిపి మహేష్‌కు 1.30 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక ఈ గణాంకాలతో మహేష్ సోషల్ మీడియాలో దక్షిణాదిలో అత్యధిక ఫాలోవర్లు ఉన్న సెలబ్రిటీ అయిపోయాడు. కేవలం ట్విట్టర్‌లోనే మహేష్‌కు 6.7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. సాధారణంగా మహేష్ బాబు ట్విట్టర్‌లోనే యాక్టివ్‌గా ఉంటాడు. ఇక దీంతోపాటు ఇతర సోషల్ మీడియా వేదికల్లోనూ అత్యధిక సంఖ్యలో మహేష్‌కు ఫాలోవర్లు ఉన్నారు. దక్షిణాదిలో నటులు ధనుష్, అల్లు అర్జున్, ప్రభాస్‌లు కూడా అత్యధిక సంఖ్యలో సోషల్ మీడియా ఫాలోవర్లను కలిగి ఉండగా, వారిని దాటి మహేష్ ముందుకెళ్లాడు.

5415
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS