సితార చూడటానికి అచ్చం అమ్మలానే ఉంది : మహేష్

Tue,March 13, 2018 05:45 PM

Mahesh Babu Thinks Daughter Sitara Looks

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ అప్పుడప్పుడు తమ కూతురు సితార ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకి కావలసినంత ఆనందాన్ని అందిస్తుంటారు. తాజాగా మహేష్ తన కూతురు సితార పిక్ ఒకటి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. దానికి పింక్ గర్ల్ పవర్..చూడటానికి అచ్చం మా అమ్మలాగే ఉంది. అని కామెంట్ పెట్టారు. మహేష్ పోస్ట్ చేసిన ఈ ఫోటోకి కొద్దిగంటలలోనే 1.08 లక్షల లైక్స్ వచ్చాయి. నిజంగానే సితార.. వాళ్ళ నాన్నమ్మ ఇందిరా దేవిలాగే ఉందని కొందరు కామెంట్ పెడుతుంటే మరి కొందరు లిటిల్ ప్రిన్స్ రాబోయే కాలంలో స్టార్ హీరోయిన్ గా అలరిస్తుందని చెబుతున్నారు. ఏదేమైన ఇప్పటి నుండి సితారకి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడం విశేషం. ఇక మహేష్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ 20న విడుదల కానుండగా, ఇందులో కైరా అద్వాణీ కథానాయికగా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు. ఈ మూవీ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలోను మహేష్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

Pink!! Girl power. 💗💗 Looks exactly like my mother💗💗

A post shared by Mahesh Babu (@urstrulymahesh) on


4117
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS