రానాతో దిగిన ఫోటో షేర్ చేస్తూ బ‌ర్త్‌డే విషెస్ తెలిపిన మ‌హేష్ బాబు

Sat,December 14, 2019 12:21 PM

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. స‌మాజంలో జ‌రుగుతున్న ప‌లు స‌మ‌స్య‌ల‌పై స్పందిస్తూనే సినీ సెల‌బ్రిటీల బ‌ర్త్‌డే రోజు విషెస్ అందిస్తున్నారు. ఇటీవ‌ల అనీల్ రావిపూడి, ర‌జ‌నీకాంత్‌, వెంక‌టేష్‌ల‌కి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు అందించిన మ‌హేష్ బాబు తాజాగా త‌న ట్విట్ట‌ర్ ద్వారా రానాకి బ‌ర్త్‌డే గ్రీటింగ్స్ తెలిపారు.


ఓ ఆడియో ఫంక్ష‌న్‌లో రానాతో దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. హ్యాపీ బ‌ర్త్‌డే రానా.. మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధించాలని కోరుకుంటున్నాను. రానున్న రోజుల‌లో మీరు మ‌రిన్ని విజ‌యాలు సాధిస్తారు అని మ‌హేష్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. మ‌హేష్ ట్వీట్‌కి రానా స్పందిస్తూ.. థ్యాంక్యూ చీఫ్ అని కామెంట్ పెట్టారు. మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో స‌రిలేరు నీకెవ్వ‌రు అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. జ‌న‌వ‌రి 11న ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఇందులో మ‌హేష్ మేజ‌ర్ అజ‌య్ కృష్ణ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.1409
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles