సీతా పాప‌కి డాట‌ర్స్ డే శుభాకాంక్ష‌లు తెలిపిన మ‌హేష్‌

Sun,September 22, 2019 10:40 AM

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు గారాల ప‌ట్టి సితార వెండితెర ఎంట్రీ ఇవ్వ‌క‌పోయిన సోష‌ల్ మీడియా ద్వారా ఫుల్ ఫేమ‌స్. మ‌హేష్ లేదంటే న‌మ‌త్ర అప్పుడ‌ప్పుడు సితార డ్యాన్స్‌కి సంబంధించిన ప‌లు వీడియోల‌ని సామాజిక మాధ్య‌మాల‌లో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని ఉత్సాహ‌ప‌రుస్తుంటారు. సితార ఇటీవ‌ల సొంతంగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి అందులో వెరైటీ వీడియోస్ పోస్ట్ చేస్తుంది. ఈ వీడియోల‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తున్నాయి. అయితే సితార‌ని ప్రాణంగా ప్రేమించే మ‌హేష్ ఈ రోజు డాట‌ర్స్ డే సంద‌ర్భంగా త‌న కూతురికి ట్విట్ట‌ర్ ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపాడు. నువ్వు నా ప్రియ‌మైన కొంటె కూతురివి. నిన్ను ఎప్ప‌టికి ప్రేమిస్తూనే ఉంటాను. జీవితంలో అత్యంత ఎత్తుకి ఎద‌గాలని మ‌నస్పూర్తిగా కోరుకుంటున్నాను అని మ‌హే్ పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న స‌రిలేరు నీకెవ్వ‌రు అనే సినిమా చేస్తున్నాడు. సంక్రాంతి కానుక‌గా ఈ మూవీ రిలీజ్ కానుంది


1619
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles