అర్జున్ రెడ్డి డైరెక్ట‌ర్‌తో సూప‌ర్ స్టార్ మ‌హేష్‌..!

Sun,February 18, 2018 12:34 PM
mahesh babu, sandeep reddy vanga team up first time

అర్జున్ రెడ్డి సినిమాతో సంచ‌ల‌నం సృష్టించిన క్రేజీ డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా. తొలి సినిమాతోనే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ హిట్ కొట్టిన సందీప్ త‌న త‌దుప‌రి సినిమా కోసం క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు. మొద‌టి సినిమాతో ఎక్కువ‌గా యూత్‌ని ఆకర్షించిన ద‌ర్శ‌కుడు రెండో సినిమాని ఏ నేప‌థ్యంలో తీయ‌నున్నాడు అనే దానిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా సందీప్ రెడ్డి వంగా ఓ మూవీని తీయ‌నున్న‌ట్టు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వస్తున్నాయి. ఇప్ప‌టికే మ‌హేష్‌ని క‌లిసి సందీప్ స్టోరీ వినిపించాడ‌ని తెలుస్తుండ‌గా, దీనికి ఫుల్ ఇంప్రెస్ అయిన మ‌హేష్ వ‌చ్చే ఏడాది ఈ చిత్రాన్ని చేద్దామ‌ని చెప్పాడ‌ట‌. ఈ ప్రాజెక్ట్‌లో మ‌హేష్ మెకానిక్‌గా కనిపించ‌నున్నాడ‌ని టాక్‌. యూత్‌తో పాటు ఫ్యామిలీని ఆక‌ట్టుకునేలా సందీప్ రెడ్డి చిత్ర క‌థ‌ని రాసుకున్నాడ‌ట‌. మ‌హేష్ ప్ర‌స్తుతం భ‌ర‌త్ అను నేను చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ త‌ర్వాత వంశీ పైడిప‌ల్లితో ఓ ప్రాజెక్ట్ చేయ‌నున్నాడు. ఇది పూర్తైన వెంట‌నే మ‌హేష్‌తో క‌లిసి సందీప్ రెడ్డి త‌న రెండో సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్ళ‌నున్నాడ‌ని ఫిలిం న‌గ‌ర్ టాక్‌. మ‌రి దీనిపై పూర్తి క్లారిటీ రావ‌లసి ఉంది.

2299
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS