మీరు మా హృద‌యాల‌లో ఎప్ప‌టికీ నిలిచి ఉంటారు: మ‌హేష్‌

Tue,October 15, 2019 12:17 PM

మిసైల్ మ్యాన్, పీపుల్స్ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం 1931, అక్టోబ‌ర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. పేద కుటుంబలో పుట్టిన ఆయన ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. అనేక ఇబ్బందుల‌ని ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకోగా, ఆయ‌న ఆలోచ‌న‌లో దాగి ఉన్న ప్రేరణాత్మకమైన విషయాల నేప‌థ్యంలో బ‌యోపిక్ కూడా రూపొందిస్తున్నారు. ఈ చిత్రం రాజ్ చెంగప్ప వ్రాసిన కలాం జీవిత చరిత్ర ఆధారంగా రూపొంద‌నుంద‌ని స‌మాచారం. ఎంద‌రో అభిమానుల‌ని సొంతం చేసుకున్న అబ్ధుల్ క‌లాం 83 ఏండ్ల వయస్సులో జూలై 2015న ఐఐఎం షిల్లాంగ్‌లో ప్రసంగిస్తూ కన్నుమూసారు. ఈ రోజు అబ్ధుల్ క‌లాం జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌తి ఒక్క భారతీయుడు ఆయ‌న‌ని గుర్తు చేసుకుంటూ శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టిస్తున్నారు. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కూడా త‌న ట్విట్టర్ ద్వారా అబ్ధుల్ క‌లాంని స్మ‌రించుకున్నారు. అబ్ధుల్ క‌లాం ఎంద‌రికో ప్రేరణగా నిలిచారు. మ‌న‌దేశాన్ని గ‌ర్వించే స్థాయిలో నిలిపారు . మీరు ఖచ్చితంగా మా హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు సర్ అని పేర్కొన్నాడు.
1736
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles