క్యూట్ స్మైల్‌తో ఇంట‌ర్నెట్‌ని షేక్ చేస్తున్న మ‌హేష్‌

Tue,May 14, 2019 11:40 AM
Mahesh Babu Is All Smiles with Namrata Shirodkar

అమ్మాయిల క‌లల రాకుమారుడు మ‌హేష్ బాబు క్యూట్ స్మైల్‌కి ఫిదా కానివారు లేరు. చిన్న చిరున‌వ్వుతో అమ్మాయిల గుండెల్లో బాణాలు దింపే మ‌హేష్ తాజాగా త‌న భార్య న‌మ్ర‌తా శిరోద్క‌ర్‌, ఆమె సోద‌రి శిల్పా శిరోద్క‌ర్‌తో క‌లిసి న‌వ్వులు చిందించాడు. ఈ ఫోటో ప్ర‌స్తుతం ఇంట‌ర్నెట్‌ని షేక్ చేస్తుంది. మ‌హ‌ర్షి సెల‌బ్రేష‌న్స్‌లో భాగంగా మ‌హేష్‌, న‌మ్ర‌తా, శిల్పా ఈ పిక్ దిగిన‌ట్టు తెలుస్తుంది. న‌మ్ర‌త త‌న ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ ఫోటోకి భారీ రెస్పాన్స్ వ‌స్తుంది. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు మ‌హ‌ర్షి స‌క్సెస్ సెల‌బ్రేష‌న్‌లో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉన్నాడు. రీసెంట్‌గా అన్ని కంపెనీల సీఈవోల‌తో మీటింగ్‌లో పాల్గొన్నాడు. రేపు సుద‌ర్శ‌న్ 35 ఎంఎంలో జ‌ర‌గ‌నున్న మ‌హ‌ర్షి సక్సెస్ సెల‌బ్రేష‌న్స్‌లో పాల్గొన‌నున్నాడు. మే 9న విడుద‌లైన మ‌హ‌ర్షి చిత్రం భారీ వ‌సూళ్ళు రాబ‌డుతూ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, అల్ల‌రి న‌రేష్ ముఖ్య పాత్ర‌లు పోషించారు


3364
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles