'ఎఫ్‌2' ట్రైల‌ర్‌కి మ‌హేష్ ఫిదా

Thu,December 13, 2018 12:22 PM
mahesh babu impressed to f2 teaser

వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో అనీల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్నమాస్ అండ్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ ఎఫ్‌2 (ఫన్‌ అండ్‌ ఫస్ట్రేషన్‌). దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెంకీ స‌ర‌స‌న త‌మ‌న్నా, వ‌రుణ్ తేజ్‌తో మెహ‌రీన్ జ‌త‌క‌ట్టారు. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. వెంకీ, వరుణ్ తోడళ్లుళ్లుగా కనిపించనున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కి మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించ‌డంలో ఎలాంటి సందేహం లేద‌ని అంటున్నారు. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమా టీజర్‌ను చిత్ర బృందం వెంకీ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా నిన్న సాయంత్రం విడుద‌ల చేసింది. ఈ టీజ‌ర్ ఆద్యంతం న‌వ్వులు పూయిస్తుండ‌గా, ప్రతి ఒక్క‌రిని ఎంత‌గానో అల‌రిస్తుంది.

తాజాగా ఎఫ్ 2 టీజ‌ర్‌పై మ‌హేష్ ప్ర‌శంస‌లు కురిపించాడు . మూవీ ఫ‌న్‌, ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంద‌ని టీజ‌ర్‌ని బ‌ట్టి అర్ధ‌మ‌వుతుంది. వెంకీ సార్ టెరిఫిక్. సినిమా టీం అంద‌రికి బెస్ట్ విషెస్‌. హ్యాపీ బర్త్ డే సార్. మరో అద్భుతమైన సినిమాలో నటించారు అని ట్వీట్ చేశారు మ‌హేష్‌. దీనికి స్పందించిన ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి .. మ‌హేష్‌కి ధ‌న్య‌వాదాలు తెలిపారు. మీ నుండి ఇలాంటి స్పంద‌న వ‌స్తుంద‌ని ఊహించ‌లేదు అని అన్నారు. టీజ‌ర్ మిమ్మ‌ల్ని ఆనంద‌ప‌ర‌చినందుకు సంతోషంగా ఉంద‌ని వ‌రుణ్ తేజ్ ట్వీట్ చేశారు. మ‌హేష్‌, వెంకీ సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు అనే మ‌ల్టీ స్టార‌ర్ చిత్రంలో న‌టించిన సంగ‌తి తెలిసిందే.2195
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles