బుర్రిపాలెంలోని పాఠశాలకి కృష్ణ తల్లి పేరు పెట్టిన మహేష్

Wed,February 28, 2018 05:52 PM
Mahesh Babu build the school in burripalem

ఎంత సినిమా స్టార్లయినా ఉన్న ఊరినీ, కన్నవారినీ మరచిపోరు. ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవు...ఎదలోపలి మమకారం ఎన్నటికీ పోదు... అని ఓ సినిమా పాట ఉంది. ఆ మమకారం అలాంటిది. సూపర్ స్టార్ కృష్ణ సొంతూరు బుర్రిపాలెం అని అందరికీ తెలుసు.ఆయన కొడుకు మహేష్ బాబుకు కూడా ఆ ఊరంటే ఇష్టం. అందుకే ఆ ఊరిని దత్తత తీసుకొని అక్కడ పాఠశాల భవనం నిర్మించారు. దీనిని ఇవాళ ప్రారంభించగా, దీనికి కృష్ణ తల్లి , తండ్రి ఘట్టమనేని నాగరత్నమ్మ, రాజా పేరుతో జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల అని పేరు పెట్టారు. ఇప్పటికే బుర్రిపాలెంలో పలు కార్యక్రమాలు చేపట్టిన మహేష్ అక్కడ స్కూల్ కూడా నిర్మించడంతో పలువురు అభినందిస్తున్నారు. ఇక తెలంగాణలో కొత్తూరుని కూడా దత్తత తీసుకున్న మహేష్ అక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే.


4555
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles