మ‌హేష్ త‌ర్వాతి ప్రాజెక్ట్‌పై వ‌చ్చిన క్లారిటీ..!

Sat,February 23, 2019 12:28 PM

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హ‌ర్షి అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఏప్రిల్‌లో విడుద‌ల కానున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తుంది. అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్ర షూటింగ్ మార్చిలో పూర్తి కానుంది. అయితే మ‌హ‌ర్షి త‌ర్వాత మ‌హేష్ బాబు చేయ‌బోవు ప్రాజెక్ట్‌ని సుకుమార్ లేదా అనీల్ రావిపూడిల‌లో ఒక‌రు తెర‌కెక్కించ‌నున్నార‌ని కొన్నాళ్ళుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం మ‌హేష్ నెక్ట్స్ ప్రాజెక్ట్ అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఉంటుంద‌ని టాక్‌. ఈ ప్రాజెక్ట్‌ని అతి త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించి ఆ త‌ర్వాత నటీన‌టుల వివ‌రాలు వెల్ల‌డించ‌నున్నార‌ట‌. మే నుండి ఈ ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ‌తార‌ని స‌మాచారం.


మ‌హ‌ర్షి త‌ర్వాత మ‌హేష్ .. సుకుమార్‌తో చేస్తాడ‌ని ఎప్ప‌టి నుండో వార్త‌లు వ‌చ్చాయి.ఆయ‌న కోసం సుకుమార్ హిస్టారిక‌ల్ స‌బ్జెక్ట్‌ని రెడీ చేయ‌గా, దానిపై అంత ఇంట్రెస్ట్ చూపించని మ‌హేష్ మ‌రో క‌థ‌ని సిద్దం చేయ‌మ‌న్నార‌ట‌. దీంతో సుకుమార్ రొమాంటిక్ యాక్షన్ జోనర్ లో క‌థ‌ని సిద్దం చేసాడ‌ని అన్నారు. ఈ సినిమా, ఫారెస్ట్ బ్యాక్‌ డ్రాప్‌లో రివెంజ్ డ్రామాగా ఉంటుంద‌ని టాక్. ఇందులో మ‌హేష్‌ని స‌రికొత్త లుక్‌లో చూపించ‌నున్నాడ‌ట సుక్కూ. అయితే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన బౌండెండ్ స్క్రిప్ట్ పూర్తి కాక‌పోవ‌డం వ‌ల‌న‌నే అనీల్ రావిపూడితో సినిమా చేయాల‌ని మ‌హేష్ భావిస్తున్నాడ‌ట‌.

2469
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles