దీన‌స్థితిలో క‌న్నుమూసిన ‘నెంబర్ వన్’ విల‌న్

Sun,February 10, 2019 06:55 AM

కృష్ణ హీరోగా తెర‌కెక్కిన నెంబ‌ర్ వ‌న్ చిత్రంలో విల‌న్‌గా న‌టించిన బాలీవుడ్ న‌టుడు మ‌హేష్ ఆనంద్(57) అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ చిత్రంలో ఆయ‌న బ్రహ్మానందంతో పేపర్‌ను ముక్కలు ముక్కలుగా చింపించి మళ్లీ అతికించమని ఆర్డర్ వేస్తారు. ఈ కామెడీ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. టాప్ హీరో సినిమాలోను న‌టించిన ఆయ‌న‌కి మంచి గుర్తింపు వచ్చింది. 90ల‌లో విల‌న్‌గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న మ‌హేష్ ఆనంద్ రీసెంట్‌గా రంగీల రాజా అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. జ‌న‌వ‌రి 18న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. దాదాపు 18 ఏళ్ళ త‌ర్వాత మ‌హేష్‌ని స్క్రీన్‌పైన చూసిన అభిమానులు ఆనందం వ్య‌క్తం చేశారు.


సినిమాల‌కి దూరంగా ఉంటున్న మ‌హేష్ డ‌బ్బు కోసం రెజ్లింగ్ ఆడార‌ని, దాని వ‌ల‌న ఆర్ధికంగా బాగా చితికి పోయార‌ని తెలుస్తుంది. ఈ మ‌ధ్య ఓ ఇంట‌ర్వ్యూలో కూడా త‌ను ఆర్ధిక ఇబ్బందుల‌లో ఉన్న‌ట్టు తెలిపారు. అయితే రీసెంట్‌గా ముంబైలో అంథేరిలోని యారి రోడ్‌లో ఉన్న మ‌హేష్ నివాసంలో ఆయ‌న‌ మృత‌దేహాన్ని శ‌నివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతిదేహం పూర్తిగా కుళ్లిపోయి చుట్టుప‌క్క‌ల వారికి దుర్గంధమైన వాస‌న వ‌స్తుండ‌డంతో వారు పోలీసుల‌కి స‌మాచారం అందించారు. మృత‌దేహాన్ని చూసిన పోలీసులు ఆయ‌న చ‌నిపోయి రెండు రోజులు అయి ఉంటుంద‌ని భావిస్తున్నారు. పోస్ట్ మార్ట్ నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించిన పోలీసులు ఆయ‌న మృతికి కార‌ణ‌మేంట‌నే దానిపై ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. కొంత‌కాలం నుండి మ‌హేష్ ఒంట‌రిగా ఉంటుండ‌గా, ఆయన భార్య మాస్కోలో ఉంటున్నట్లు సమాచారం. బాలీవుడ్‌లో ‘కురుక్షేత్ర, స్వరాజ్, కూలీ నెంబర్ 1, విజేత’ చిత్రాల‌లో న‌టించారు మ‌హేష్‌. ఆయ‌న మృతికి బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ కూడా సంతాపం వ్య‌క్తం చేసింది.

6147
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles