సుకుమార్ సినిమాని ఓకే చేసిన మ‌హేష్‌..!

Fri,June 8, 2018 10:29 AM
mahesh 26 movie gets clarity

రంగ‌స్థ‌లం చిత్రంతో భారీ హిట్ కొట్టిన సుకుమార్‌, భ‌ర‌త్ అనే నేను వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చిన మ‌హేష్ బాబు కాంబినేష‌న్‌లో ఓ మూవీ తెర‌కెక్క‌నుంద‌ని వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ వార్త‌లు నిజం కాబోతున్నాయ‌ట‌. ఇటీవ‌ల ఫోన్‌లో మ‌హేష్ బాబుకి బ్రీఫ్‌గా లైన్ వినిపించాడ‌ట సుకుమార్‌. ఆ లైన్ మ‌హేష్‌కి ఎంతో న‌చ్చ‌డంతో వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి పూర్తి డీటైల్స్ వెల్ల‌డించ‌నున్నారు.

వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న సినిమా త‌ర్వాత మ‌హేష్ త‌న 26వ చిత్రాన్ని సుకుమార్‌తో చేయ‌నున్నాడు. వ‌రుస హిట్స్ ఇస్తున్న మైత్రి మూవీ మేక‌ర్స్ బేన‌ర్‌లో ఈ చిత్రం రూపొంద‌నుంది. ఈ ప్రాజెక్ట్ కోసం సుకుమార్ ఏకంగా 15 కోట్ల రెమ్యున‌రేష‌న్ అందుకోబోతున్న‌ట్టు స‌మాచారం. తాజాగా ప్రీ ప్రొడ‌క్షన్ ప‌నులు మొద‌లు పెట్టిన‌ సుక్కూ 2019లో మూవీ విడుద‌ల చేయ‌నున్నాడట‌. సంగీత ద‌ర్శ‌కుడిగా మ‌రోసారి త‌న సినిమాకి దేవి శ్రీ ప్రసాద్‌ని ఎంపిక చేశాడ‌ని తెలుస్తుంది.

త‌న తాజా చిత్రంలో న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌ని కూడా ఎంపిక చేసే ప‌నిలో ఉన్నాడు సుకుమార్‌. రంగ‌స్థ‌లం చిత్రం వంటి భారీ హిట్ ఇచ్చిన సుకుమార్ మ‌రీ ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా త‌న త‌దుప‌రి సినిమాని మొద‌లు పెట్ట‌డం విశేషం. మ‌హేష్ 26వ చిత్రంగా రానున్న ఈ సినిమా అభిమానుల‌కి పసందైన విందు అందించే విధంగా ఉంటుంద‌ని అంటున్నారు. మ‌హేష్-సుకుమార్ కాంబినేషన్‌లో తెర‌కెక్కిన 1 నేనొక్క‌డినే చిత్రం భారీ డిజాస్ట‌ర్ కావ‌డంతో తాజా ప్రాజెక్ట్‌పై చాలా హార్డ్ వ‌ర్క్ చేస్తున్నాడ‌ట సుకుమార్‌. ప‌క్కా స్క్రిప్ట్‌తో సెట్స్ పైకి వెళ్ళేందుకు క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు మ‌న లెక్క‌ల మాస్టారు.

2085
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS