డెహ్రాడూన్‌లో అల్ల‌రి న‌రేష్ బ‌ర్త్‌డే వేడుక‌లు

Sun,July 1, 2018 12:56 PM
mahesh 25 team celebrated the birthday of allari naresh

ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ త‌న‌యుడిగా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయిన అల్ల‌రి నరేష్ ఆన‌తి కాలంలోనే త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కామెడీతో కిత‌కిత‌లు పెట్టించే ఈ అల్ల‌రోడు ఇటీవ‌లి కాలంలో స‌రైన స‌క్సెస్ లు అందుకోలేక‌పోతున్నాడు. ప్ర‌స్తుతం సిల్లీ ఫెలోస్ అనే సినిమాతో పాటు మ‌హేష్ 25వ చిత్రం చేస్తున్నాడు. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు న‌రేష్ . అయితే ఈ చిత్రం ప్ర‌స్తుతం డెహ్రాడూన్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. న‌రేష్ కూడా కొన్నాళ్లుగా టీంతోనే ఉన్నాడు. నిన్న అల్ల‌రి న‌రేష్ బ‌ర్త్ డే కావడంతో చిత్ర యూనిట్ అల్ల‌రి న‌రేష్ బ‌ర్త్‌డేని సెట్‌లోనే జరిపించారు. మ‌హేష్ , పూజా హెగ్డే, వంశీ పైడిప‌ల్లి త‌దిత‌రులు న‌రేష్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ పాల్గొన్నారు. బ‌ర్త్‌డేకి సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. మ‌హేష్ 25వ చిత్రంలో మ‌హేష్ బాబు గొప్పింటి ధ‌న‌వంతుడిగా క‌నిపించ‌నుండ‌గా, అల్ల‌రి న‌రేష్ కుచేలుడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌. ముగ్గురు విద్యార్థులు.. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసేందుకు ఉత్తర భారతదేశ పర్యటనకు వెళ్లే కథాంశం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. రాజసం అనే టైటిల్‌ని చిత్రానికి ప‌రిశీలిస్తున్న‌ట్టు టాక్‌.2742
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles