మ‌ళ్ళీ ఏప్రిల్‌కే ఫిక్స్ అయిన మ‌హేష్

Tue,July 3, 2018 12:10 PM
mahesh 25 movie release date fixed

సూప‌ర్ స్టార్ మ‌హేష్‌కి ఏప్రిల్ నెల బాగా కలిసొస్తుంది. ఆ నెల‌లో విడుద‌లైన ప్ర‌తి సినిమా మంచి విజ‌యం సాధిస్తుంది. మ‌హేష్ కెరియ‌ర్‌లో బెస్ట్‌గా నిలిచిన పోకిరి చిత్రం ఏప్రిల్ నెల‌లోనే విడుద‌ల కాగా, ఇటీవ‌ల వ‌చ్చిన భ‌ర‌త్ అనే నేను చిత్రం కూడా ఏప్రిల్ నెల‌లోనే రిలీజై బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యాన్ని సాధిస్తుంది. భ‌ర‌త్ అనే నేను సినిమాకి నా పేరు సూర్య చిత్రం పోటీగా వ‌చ్చిన ఈ మూవీని మే నెల‌కి ఫిక్స్ చేశారు. ఇక ఇప్పుడు మ‌హేష్ న‌టిస్తున్న తాజా చిత్రం కూడా ఏప్రిల్ నెల‌లోనే విడుద‌ల‌కి సిద్ధ‌మైందట‌.

మ‌హేష్ ప్ర‌స్తుతం వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా డెహ్రాడూన్‌లోని క‌ళాశాల‌లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో అల్ల‌రి న‌రేష్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ర‌వి అనే పాత్ర‌లో మ‌హేష్ క్లోజ్ ఫ్రెండ్‌గా క‌నిపించ‌నున్నాడ‌ట‌. ముగ్గురు విద్యార్థులు.. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసేందుకు ఉత్తర భారతదేశ పర్యటనకు వెళ్లే కథాంశం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. చిత్రంలో మహేష్ విద్యార్థిగా, యూఎస్ కంపెనీ సీఈవోగా కనిపించనున్నారు. అయితే కొన్నాళ్ళుగా మూవీ రిలీజ్‌కి సంబంధించి ప‌లు వార్త‌లు వినిపిస్తుండ‌గా, నిర్మాత‌లు ఏప్రిల్ 5,2019న మూవీ విడుద‌ల కాబోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దీంతో మ‌హేష్ మ‌రోసారి త‌న సెంటిమెంట్‌నే ఫాలో అవుతున్న‌ట్టు అర్ధ‌మ‌వుతుంది.

2279
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles