క్లాస్ రూంలో మ‌హేష్ .. వైర‌ల్‌గా మారిన పిక్

Thu,June 21, 2018 11:14 AM
mahesh 25 movie pics leaked

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో త‌న 25వ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. డెహ్రాడూన్‌లో తొలి షెడ్యూల్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం ఆ త‌ర్వాత హైద‌రాబాద్‌లోను కొన్ని షెడ్యూల్స్ జ‌రుపుకోనుంది. రాయ‌ల‌సీమ నేప‌థ్యంలో ఈ సినిమా తెర‌కెక్కుతుంద‌ని తెలుస్తుండ‌గా, ఇందులో మ‌హేష్ చాక్లెట్ బాయ్‌లా కాకుండా మీస‌క‌ట్టు, గ‌డ్డంతో ర‌ఫ్ లుక్‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌. ఇటీవ‌ల స‌మ్మోహ‌నం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిధిగా హాజ‌రైన మ‌హేష్ న్యూ లుక్‌లో ప్రేక్షకుల్ని థ్రిల్ చేశారు.

డెహ్రాడూన్‌లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా లొకేషన్‌లోని పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. మొన్నమ‌హేష్‌ న‌డుస్తూ ఉన్న ఫోటో ఒక‌టి బ‌య‌ట‌కు రాగా, ఇప్పుడు క్లాస్ రూంలో హీరోయిన్ పూజా హెగ్డేతో సీరియ‌స్ డిస్కస్ చేస్తున్న ఫోటో వైర‌ల్ అవుతుంది. ఇందులో మ‌హేష్‌ని చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారు. దిల్ రాజు, అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలను సమకూర్చుతున్నారు. ఇక మూవీలో మరో విశేషం ఏంటంటే.. రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో నడిచే ఈ కథలో మహేష్‌కి స్నేహితుడిగా అల్లరి నరేష్ నటిస్తున్నాడు.

మ‌హేష్ 25వ చిత్రంలో మ‌హేష్ బాబు గొప్పింటి ధ‌న‌వంతుడిగా క‌నిపించ‌నుండ‌గా, అల్ల‌రి న‌రేష్ కుచేలుడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌. ముగ్గురు విద్యార్థులు.. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసేందుకు ఉత్తర భారతదేశ పర్యటనకు వెళ్లే కథాంశం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. రాజసం అనే టైటిల్‌ని చిత్రానికి ప‌రిశీలిస్తున్న‌ట్టు టాక్‌.

2351
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS