స్టైలిష్ లుక్‌లో మ‌హేష్‌.. టీజ‌ర్ విడుద‌ల‌

Sat,April 6, 2019 09:10 AM
maharshi teaser released

భ‌ర‌త్ అనే నేను చిత్రం త‌ర్వాత మ‌హేష్ న‌టించిన‌ చిత్రం మ‌హ‌ర్షి. మ‌హేష్ 25వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుంది. ఈ చిత్రంలో మహేష్ మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో నటించనున్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన 5 మందిలో ఒకడిగా మ‌హేష్‌ నటిస్తున్నట్లు తెలుస్తోంది. కార్పోరేట్ అధిపతిగా యూఎస్ నుండి తిరిగివచ్చి వ్యవసాయంలో రైతులకు సరికొత్త విధానాన్ని అందించే పాత్రలో కనిపించబోతున్నారట మహేష్. దిల్ రాజు, అశ్వినీదత్ , పీవీపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మే 9న విడుద‌ల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్ర‌మోష‌న్స్ వేగవంతం చేశారు మేక‌ర్స్. ఇటీవ‌ల చిత్రానికి సంబంధించి తొలి లిరిక‌ల్ వీడియో విడుద‌ల చేయ‌గా, దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఉగాది శుభాకాంక్ష‌ల‌తో టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో మ‌హేష్ స్టైలిష్ లుక్ అభిమానుల‌లో వైబ్రేష‌న్స్ క‌లుగజేస్తుంది. మ‌హేష్ చెప్పే డైలాగ్స్ ఫ్యాన్స్‌కి పూనకం తెప్పిస్తున్నాయి. చిత్రంలో మ‌హేష్ స్నేహితుడిగా అల్ల‌రి న‌రేష్ న‌టిస్తున్నారు. ఈ చిత్రం రిలీజ్ త‌ర్వాత మ‌హేష్ త‌న 26వ చిత్రంగా అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌నున్నాడు.

1570
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles