రిలీజ్ డేట్ మార్చిన 'మ‌హ‌ర్షి'

Wed,January 23, 2019 08:09 AM
maharshi release date fixed

భ‌ర‌త్ అనే నేను చిత్రంతో అభిమానుల‌ని అల‌రించిన మ‌హేష్ బాబు త్వ‌ర‌లో మ‌హర్షి అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నున్నాడు. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్ర‌స్తుతం పొల్లాచ్చిలో జ‌రుగుతుంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో ‘అల్లరి’ నరేశ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. అశ్వనీదత్, ‘దిల్‌’ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న విడుద‌ల కానుంద‌ని ముందుగా ప్ర‌క‌టించారు. కాని ప‌లు కార‌ణాల వ‌ల‌న‌ ఏప్రిల్ 26న విడుద‌ల అవుతుంద‌ని ఇటీవ‌ల‌ ప్ర‌చారం జ‌రిగింది. దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చారు దిల్ రాజు. ఏప్రిల్ 25న మ‌హ‌ర్షి చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్నామ‌ని ఆయ‌న తెలిపారు. మ‌హేష్ న‌టించిన ‘పోకిరి (2006 ఏప్రిల్‌ 28), భరత్‌ అనే నేను (2018 ఏప్రిల్‌ 20)’ ఏప్రిల్ నెల‌లోనే విడుద‌లై మంచి విజ‌యం సాధించ‌డంతో మ‌హ‌ర్షి కూడా త‌ప్ప‌క భారీ విజ‌యం సాధిస్తుంద‌ని టీం భావిస్తుంది. మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా ఈ సినిమా టీజ‌ర్‌ని రిలీజ్ చేయాల‌ని టీం ఆలోచ‌న చేస్తుంద‌ట‌. ఈ చిత్ర బృందం ఫిబ్ర‌వ‌రిలో అబుదాబికి వెళ్ళ‌నుండ‌గా, అక్క‌డ కీల‌క స‌న్నివేశాలు తెర‌కెక్కించ‌నున్నార‌ట‌.

1520
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles