మ‌హ‌ర్షి రిలీజ్ డేట్ మ‌ళ్ళీ మారింది..!

Thu,March 7, 2019 08:09 AM

వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ హీరోగా తెర‌కెక్కుతున్న మ‌హ‌ర్షి చిత్రం రిలీజ్ డేట్ విష‌యంలో నిర్మాత‌లు దోబూచులాడుతున్నారు. ముందుగా ఏప్రిల్ 5న మూవీ రిలీజ్ అవుతుంద‌న్న నిర్మాత‌లు ఆ ఆ త‌ర్వాత 26 అన్నారు. మ‌ళ్ళీ రీసెంట్‌గా 25న త‌ప్ప‌క విడుద‌ల చేస్తామ‌ని అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. క‌ట్ చేస్తే మ‌ళ్ళీ రిలీజ్ డేట్ మార్చారు. మే 9న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. కష్టపడి పూర్తి చేసిన చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్‌వర్క్ హడావిడిగా చేయడం ఇష్టం లేదు. అందుకే మే 9న చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం అన్నారు దిల్ రాజు.


మ‌హ‌ర్షి చిత్రాన్ని దిల్ రాజు, అశ్వినీదత్ , పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అశ్వినీదత్ నిర్మించిన జగదేకవీరుడు అతిలోకసుందరి, మహానటి మే 9th వచ్చాయి. అలానే దిల్ రాజు బ్యానర్ లో పరుగు, భద్ర కూడా మే లో వచ్చాయి. ఈ సినిమాల‌న్నీ భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించాయి. ఈ క్ర‌మంలో మేలో విడుద‌ల కానున్న మ‌హ‌ర్షి చిత్రం కూడా భారీ హిట్ కొడుతుంద‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా పూజా హెగ్డే న‌టిస్తుంది. అల్ల‌రి న‌రేష్ గెస్ట్ రోల్‌లో క‌నిపించి సంద‌డి చేయ‌నున్నాడు. హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రంలో మహేష్ మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో నటించనున్నారు.

1465
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles