'మ‌హ‌ర్షి' లొకేష‌న్ పిక్స్ లీక్

Tue,January 29, 2019 08:14 AM
maharshi pics goes on viral

భ‌ర‌త్ అనే నేను చిత్రం త‌ర్వాత మ‌హేష్ న‌టిస్తున్న చిత్రం మ‌హ‌ర్షి. మ‌హేష్ 25వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుంది. ఇటీవ‌ల పొల్లాచ్చి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మ‌రో షెడ్యూల్ కోసం త్వ‌ర‌లో అబుదాబి వెళ్ళ‌నుంది. అక్క‌డ కీల‌క స‌న్నివేశాలు తెర‌కెక్కించిన త‌ర్వాత గుమ్మ‌డికాయ కొట్ట‌నున్నారు. అయితే రీసెంట్‌గా జ‌రిగిన షెడ్యూల్‌కి సంబంధించిన కొన్ని పిక్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. పచ్చ‌ని పొలాల్లో మ‌హేష్ మీడియాతో మాట్లాడుతున్న‌ట్టుగా ఒక పిక్ ఉండ‌గా, మ‌రో పిక్‌లో మ‌హేష్ అభిమానుల మ‌ధ్య నుండి వెళుతున్న‌ట్టుగా ఉంది. ఈ చిత్రంలో మహేష్ మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో నటించనున్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన 5 మందిలో ఒకడిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. కార్పోరేట్ అధిపతిగా యూఎస్ నుండి తిరిగివచ్చి వ్యవసాయంలో రైతులకు సరికొత్త విధానాన్ని అందించే పాత్రలో కనిపించబోతున్నారట మహేష్. దిల్ రాజు, అశ్వినీదత్ , పీవీపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 26న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

317
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles