‘మహర్షి’ నాలుగో పాట ‘పదర పదర పదరా’..

Wed,April 24, 2019 08:01 PM

మహేశ్ బాబు, వంశీపైడిపల్లి కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం మహర్షి. ఈ చిత్రంలోని నాలుగో పాటను నేడు చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘పదర పదర పదరా..నీ అడుగుకి పదును పెట్టి పదరా.. ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా..’ అంటూ సాగే పాట అద్బుతమైన లిరిక్స్ తో కొనసాగుతోంది. ఈ పాటను శ్రీమణి రాశారు. దేవిశ్రీప్రసాద్ సంగీత సారథ్యంలో శంకర్ మహదేవన్ ఈ పాటను పాడాడు.


మహేష్ మొదటి సినిమా ‘రాజకుమారుడు’లో ‘బాలీవుడ్ బాలరాజు’ అనే పాటను పాడిన శంకర్ మహదేవన్..మళ్లీ 20 సంవత్సరాల తర్వాత ‘మహర్షి’లో పాట పాడటం విశేషం. ఈ చిత్రం నుంచి ఇప్పటికే డుదలైన ‘ఛోటి ఛోటి ఛోటి బాతే.. మీటి మీటి మీటి యాదే’, ‘నువ్వే సమస్తం.. నువ్వే సిద్ధాంతం....నువ్వే నీపంతం, నువ్వేలే అనంతం’, ‘ఎవరెస్ట్ అంచున పూసిన రోజా పువ్వే ఓ చిరునవ్వే విసిరిందే..’ పాటలకు ప్రేక్షకుల నుంచి అద్బుతమైన స్పందన వస్తోన్న విషయం తెలిసిందే.

1738
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles