మ‌హ‌ర్షి చిత్రానికి ద‌క్కిన అరుదైన ఘ‌న‌త‌

Wed,November 13, 2019 09:56 AM

తాను నమ్మిన ఓ విలువ నుంచి మరో ఉన్నతమైన విలువ వరకు ఓ యువకుడు చేసే ప్రయాణాన్ని మ‌హ‌ర్షి చిత్రంలో స్థూలంగా చూపించారు చిత్ర దర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి. ఫిలాస‌ఫిక‌ల్ పాయింట్‌కి క‌మ‌ర్షియ‌ల్ అంశాన్ని జోడించి చిత్రాన్ని చాలా అందంగా తెర‌కెక్కించారు. రిషి జీవితంలో మూడుదశల్ని ప్రతిబింబిస్తూ కథను అల్లుకున్నారు. చిత్రంలో మహేష్‌బాబు, అల్లరి నరేష్, పూజాహెగ్డే మధ్య స్నేహాన్ని ఆవిష్కరించారు. ముగ్గురు మధ్య చక్కటి హాస్యాన్ని పండించారు. విజయమే లక్ష్యంగా సాగాలని తపించే యువకుడిగా ప్రథమార్థంలో రిషి పాత్రను చూపించారు.


ద్వితీయార్థంలో రైతు సమస్యలపై ఎక్కువగా దృష్టిపెట్టారు. అన్నదాత దుస్థితిని అర్థవంతమైన సన్నివేశాలు, సంభాషణలతో చెప్పే ప్రయత్నం చేశారు. ఊరి మేలు కోసం రిషి ఎంతవరకు పోరాటం చేశాడనే అంశాన్ని ఉద్వేగభరితంగా ఆవిష్కరించారు. ఈ సినిమా అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది. తాజాగా ఈ చిత్రం 2019 సంవ‌త్సరానికి గాను ట్విట్ట‌ర్‌లో అత్యంత ప్ర‌భావితం చేసే అంశాల‌లో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ మ‌హేష్ బాబు ఫ్యాన్స్‌కి కృత‌జ్ఞ‌తలు తెలియ‌జేసింది. మ‌రో ముఖ్య విశేష‌మేమంటే అజిత్ న‌టించిన విశ్వాసం చిత్రం తొలి స్థానం సంపాదించుకుంది. శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో న‌య‌న‌తార క‌థ‌నాయిక‌గా న‌టించ‌గా, జ‌గ‌ప‌తి బాబు ముఖ్య పాత్ర పోషించాడు.


1899
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles