చెన్నైలోను మ‌హ‌ర్షి హంగామా

Thu,May 9, 2019 08:49 AM
maharshi hungama at chennai

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు భ‌ర‌త్ అనే నేను బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం త‌ర్వాత న‌టించిన చిత్రం మ‌హ‌ర్షి. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం నేడు భారీ ఎత్తున విడుద‌లైంది. టిక్కెట్స్ కోసం అభిమానులు రాత్రి నుండే థియేట‌ర్స్ ద‌గ్గ‌ర ప‌డిగాపులు కాస్తున్నారు. భారీ కటట్స్ ఏర్పాటు చేసి త‌మ అభిమాన హీరోకి పాలాభిషేకం చేస్తున్నారు. డ‌ప్పుల మోత‌తో థియేట‌ర్ల ద‌గ్గ‌ర పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంది. అయితే తెలుగు రాష్ట్రాల‌లోనే కాదు ప‌క్క రాష్ట్రాల‌లోను మ‌హ‌ర్షి హంగామా న‌డుస్తుంది. చెన్నైలోని కాశీ థియేట‌ర్ ద‌గ్గర అభిమానులు ట‌పాకులు పేలుస్తూ డ్యాన్స్‌లు చేస్తూ ఆ ప్రాంతాన్ని కోలాహాలంగా మార్చేశారు . త‌మిళ‌నాట కూడా ఆయ‌న‌కి భారీ కటౌట్స్ ఏర్పాటు చేయ‌డం చూస్తుంటే మ‌హేష్ క్రేజ్ రోజు రోజుకి మ‌రింత పెరుగుతూ పోతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. మెల్‌బోర్న్‌లో మ‌హ‌ర్షి హంగామా కొన‌సాగుతుంది. అభిమానుల అల్ల‌ర్ల‌తో థియేట‌ర్స్ మారుమ్రోగిపోతున్నాయి. ప్ర‌స్తుతం మ‌హ‌ర్షి చిత్రానికి పాజిటివ్ టాక్ వ‌స్తుండ‌గా, అభిమానులు తెగ సంతోష‌ప‌డిపోతున్నారు. ఫ‌స్టాఫ్‌లో మ‌హేష్ స్టూడెంట్‌గా, బిజినెస్‌మెన్‌గా అల‌రిస్తే సెకండాఫ్‌లో రైతుగా అద‌ర‌గొట్టాడ‌ట‌. మ‌హ‌ర్షి చిత్రం ఎమోషనల్‌గా సాగిన ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైనర్ అని ప్రేక్ష‌కులు చెబుతున్నారు.





2118
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles