పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతున్న మ‌హ‌ర్షి మూవీ

Thu,May 9, 2019 08:34 AM

సూప‌ర్ స్టార్ మ‌హేష్ అభిమానులు ఎన్నాళ్ళ నుండో ఎంతో ఆస‌క్తిగా మ‌హ‌ర్షి సినిమా కోసం ఎదురు చూస్తుండ‌గా, ఈ చిత్రం నేడు ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఇప్పటికే యూఎస్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల బెనిఫిట్ షో‌లు ప్రదర్శితం కావడంతో ట్విట్టర్ వేదికగా మ‌హేష్ అభిమానుల‌తో పాటు సినిమా ల‌వ‌ర్స్ కూడా రివ్యూలు ఇస్తున్నారు. సినిమా ఫస్టాప్ అంతా కాలేజ్ స్టూడెంట్‌గా మహేష్ జర్నీ సరదాగా సాగిపోయిందని, సెకండాఫ్ ఎమోషన్‌తో మెప్పించాడని సినిమా చూసిన ప్రేక్షకులు ట్వీట్స్ చేస్తున్నారు. చిత్ర క‌థ సినిమాలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయేలా చేస్తుంద‌ని కొంద‌రు అంటుంటే, మ‌రి కొంద‌రు ఎమోష‌న‌ల్‌గా సాగిన సినిమా క్లైమాక్స్ చిత్రం భారీ విజ‌యం సాధించేలా చేస్తుంద‌ని అంటున్నారు. రైతులపై ఉండాల్సింది సింపథీ మాత్రమే కాదు.. వాళ్లను గౌరవించడం మన బాధ్యత. దేశానికి అన్నం పెట్టే రైతు ఆత్మహత్యలపై అద్భుతమైన సందేశం అంటూ ఓ అభిమాని ట్వీట్ చేశారు.


మ‌హ‌ర్షి చిత్రం ఫ‌స్టాఫ్‌లో మ‌హేష్ స్టూడెంట్‌గా, బిజినెస్‌మెన్‌గా అద‌ర‌గొట్టాడ‌ట‌. యూత్ మ‌రియు క్లాస్ ఆడియ‌న్స్‌కి ఫ‌స్టాఫ్ ఎంత‌గానో న‌చ్చుతుంద‌ని అంటున్నారు. ఇక సెకండాఫ్‌లో రైతుగా క‌నిపించ‌నున్న మ‌హేష్ మాస్ ఆడియ‌న్స్‌ని ఎమోష‌న్‌తో క‌ట్టిప‌డేయ‌నున్నాడ‌ని చెబుతున్నారు. ఓవ‌రాల్‌గా మహేష్ 25వ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ అంటూ నెటిజ‌న్స్ రివ్యూలు ఇస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మించారు. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టించ‌గా, అల్ల‌రి న‌రేష్ ..మ‌హేష్ ఫ్రెండ్ పాత్ర‌లో క‌నిపించారు. దేవి శ్రీ సంగీతానికి కూడా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ప్ర‌స్తుతం థియేట‌ర్ల ద‌గ్గ‌ర అభిమానులు బారులు తీర‌గా, కొన్ని థియేట‌ర్స్ ద‌గ్గ‌ర హౌజ్ ఫుల్ బోర్డులు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. బాహుబ‌లి త‌ర్వాత అంత‌టి భారీ స్థాయిలో ఈ చిత్రం విడుద‌లైన‌ట్టు తెలుస్తుంది. మ‌హ‌ర్షి మూవీ రివ్యూ కోసం కొద్ది గంట‌లు వేచి చూడండి
4019
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles