'మ‌హ‌ర్షి' ఆడియోకి సూప‌ర్బ్‌ రెస్పాన్స్

Wed,May 1, 2019 08:39 AM
Maharshi Full Songs Jukebox  released

సూపర్‌స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం మ‌హ‌ర్షి. మే 9న విడుద‌ల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు జోరుగా సాగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో అభిమానుల సమక్షంలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరప‌నున్నారు. ఈ వేడుక‌లో చిత్ర ట్రైల‌ర్ కూడా విడుద‌ల చేయ‌నున్నారు. ఈ ట్రైల‌ర్‌తో సినిమాపై భారీ అంచ‌నాలు పెంచాల‌ని టీం భావిస్తుంది. ఇక రీసెంట్‌గా చిత్ర ఆడియోని విడుద‌ల చేశారు. దేవి శ్రీ ప్ర‌సాద్ స్వ‌ర‌ప‌ర‌చిన బాణీల‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. మొత్తం చిత్రంలో ఆరు పాటలు ఉండ‌గా, అన్ని పాట‌లు కూడా సంగీత ప్రియుల‌ని అల‌రిస్తున్నాయి. వైజయంతి మూవీస్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి సినిమా పతాకాలపై నిర్మిస్తున్న ‘మహర్షి’ చిత్రంలో మ‌హేష్‌ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో నటించనున్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన 5 మందిలో ఒకడిగా మ‌హేష్‌ నటిస్తున్నట్లు తెలుస్తోంది. కార్పోరేట్ అధిపతిగా యూఎస్ నుండి తిరిగివచ్చి వ్యవసాయంలో రైతులకు సరికొత్త విధానాన్ని అందించే పాత్రలో కనిపించబోతున్నారట.

1561
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles