మ‌హ‌ర్షి నుండి ఆస‌క్తిక‌ర పోస్ట‌ర్ విడుద‌ల‌

Wed,March 27, 2019 10:01 AM
maharshi first song time fixed

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లో వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కిస్తున్న చిత్రం మ‌హ‌ర్షి. పూజా హెగ్డే, అల్ల‌రి న‌రేష్ ముఖ్య పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. మే 9న విడుద‌ల కానున్న ఈ చిత్రంకి సంబంధించి ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు మొద‌లు పెట్టారు. తాజాగా ఆస‌క్తికర పోస్ట‌ర్ విడుద‌ల చేసిన టీం మార్చి 29 ఉద‌యం 9.09ని.ల‌కు మొద‌టి సాంగ్‌ని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు తెలిపింది. దేవి శ్రీ ప్ర‌సాద్ స్వ‌ర‌ప‌ర‌చిన బాణీలు సంగీత ప్రియుల‌ని త‌ప్ప‌క అల‌రిస్తాయ‌ని టీం చెబుతుంది. అయితే పోస్ట‌ర్‌లో మ‌హేష్‌, అల్లరి న‌రేష్‌, పూజా హెగ్డేలు బీచ్ ఒడ్డున నిలుచొని సీరియ‌స్ డిస్క‌ష‌న్ జ‌రుపుతున్న‌ట్టుగా ఉంది. మ‌హ‌ర్షి చిత్రాన్ని పీవీపీ, అశ్వనీద‌త్‌, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తుండ‌గా, ఇందులో మ‌హేష్ స్నేహితుడి పాత్ర‌లో అల్ల‌రి న‌రేష్ క‌నిపించ‌నున్నాడని టాక్.

1949
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles