వాయిదా ప‌డ్డ మ‌హర్షి 50 రోజుల వేడుక‌

Thu,June 27, 2019 10:17 AM
Maharshi 50 days event postponed

మ‌హేష్ బాబు, పూజా హెగ్డే, అల్ల‌రి న‌రేష్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో వంశీపైడిప‌ల్లి తెర‌కెక్కించిన చిత్రం మ‌హ‌ర్షి. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ సినిమా, వైజయంతి మూవీస్‌ బ్యానర్లపై దిల్‌రాజు, పొట్లూరి ప్రసాద్‌, అశ్విని దత్‌ సంయుక్తంగా నిర్మించారు. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించాడు. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యం సాధించి ఎపిక్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచిన మ‌హ‌ర్షి చిత్రం నేటితో ( జూన్ 27)తో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్ప‌టికి ఈ చిత్రం 200 కేంద్రాల్లో స‌క్సెస్ ఫుల్‌గా న‌డుస్తుండ‌డంతో చిత్ర యూనిట్ జూన్ 28వ తేదీన హైదరాబాద్ శిల్పకళా వేదికగా 50 రోజుల వేడుకని ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని భావించింది. కాని ప్ర‌ముఖ న‌టి, ద‌ర్శ‌కురాలు విజ‌య నిర్మల హ‌ఠాన్మ‌ర‌ణంతో వేడుక‌ని వాయిదా వేస్తున్న‌ట్టు శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేషన్స్ సంస్థ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించింది. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా నేచుర‌ల్ స్టార్ నానిని ఆహ్వానించినట్టుగా సమాచారం. విజ‌య నిర్మ‌ల అంత్యక్రియ‌లు రేపు మ‌హాప్ర‌స్థానంలో జ‌ర‌గ‌నుండ‌గా మ‌హేష్‌తో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యులు హాజ‌రు కానున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌హర్షి 50 రోజుల వేడుక వాయిదా ప‌డినట్టు తెలుస్తుంది .


3755
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles