మ‌హానుభావుడు ఆడియో లాంచ్ డేట్ ఫిక్స్

Wed,September 13, 2017 01:21 PM
మ‌హానుభావుడు ఆడియో లాంచ్ డేట్ ఫిక్స్

మారుతి- శ‌ర్వానంద్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన క్రేజీ ప్రాజెక్ట్ మ‌హానుభావుడు. సెప్టెంబ‌ర్ 29న విడుద‌ల కానున్న ఈ చిత్ర ఆడియో వేడుక‌కి టైం ఫిక్స్ చేశారు మూవీ మేక‌ర్స్. సెప్టెంబ‌ర్ 16న థ‌మ‌న్ అందించిన రాకింగ్ మ్యూజిక్‌ని రిలీజ్ చేస్తున్న‌ట్టు ద‌ర్శ‌కుడు మారుతి ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. ఇప్పటికే రెండు సాంగ్స్‌ని విడుద‌ల చేసింది చిత్ర బృందం. ఈ సాంగ్స్ సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రించాయి. అయితే మ‌హానుభావుడు చిత్ర ఆడియో వేడుక‌కి చీఫ్ గెస్ట్‌గా ప్ర‌భాస్ హాజ‌రు కానున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. శ‌ర్వానంద్ న‌టించిన ర‌న్ రాజా ర‌న్, ఎక్స్ ప్రెస్ రాజా చిత్ర ఆడియోని ప్ర‌భాస్ లాంచ్ చేయ‌డంతో ఈ రెండు సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఇదే సెంటిమెంట్‌ని మ‌రోసారి రిపీట్ చేయాల‌ని టీం భావిస్తుంద‌ట‌. మెహ‌రీన్ క‌థానాయిక‌గా న‌టిస్తున్నఈ చిత్రంలో శ‌ర్వానంద్ ఓసీడీ అనే డిసార్డర్‌తో బాధ‌ప‌డుతుంటాడు. ఫ‌న్నీగా మారుతి స్టైల్ లో ఈ మూవీ ఉంటుంద‌ని తెలుస్తుంది. యూరప్ , పొల్లాచ్చి, ఇటలీ, ఆస్ట్రియా, క్రోటియా వంటి అందమైన ప్రదేశాలలో చిత్రీకరణ జరుపుకున్న‌ట్టు తెలుస్తుంది.


1493
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS