నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సావిత్రి జీవిత నేపథ్యంతో తెరకెక్కిన బయోపిక్ మహానటి. తెలుగులో తొలి బయోపిక్‌గా రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాక బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళు సాధిస్తుంది. ఓవర్సీస్‌లోను ఈ మూవీ స్టార్ హీరోల సినిమా రేంజ్లో కలెక్షన్స్ రాబడుతుంది. చిన్న , పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ సినిమాని ఆదరిస్తున్నారు. ముఖ్యంగా సావిత్రి పాత్ర పోషించిన కీర్తి సురేష్ అభినయం కోసం ఒక్కసారైన సినిమా చూడాలని సినీ లవర్స్ కోరుకుంటున్నారు. అయితే మహానటిలో సావిత్రి జీవితాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించడంతో ఆ తరం వారు మహానటి మూవీ చూసేందుకు థియేటర్స్ దగ్గర క్యూ కడుతున్నారు. 50 ఏళ్ళకి పైబడిన వయస్సు వారు కూడా మండే ఎండలలో ఈ సినిమా చూసేందుకు థియేటర్స్ దగ్గరకి వస్తున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న వైజయంతి మూవీస్ వారు తాజాగా ఓ ప్రకటన చేశారు. జూన్ మూడో వారం మహానటి మీ దగ్గరికే వస్తుంది. తన తరం వారి దగ్గరకి తరలి వస్తుంది అని పోస్టర్ ద్వారా తెలిపారు. ఓల్డేజ్ హోమ్‌లో మహానటి చూస్తూ సంబరాలు చేసుకోండి అని అన్నారు. అయితే ఇందుకు చేయవలసింది మీ డీటెయిల్స్ [email protected]కి పంపించడమే. మరి మహానటి చిత్రం బృందం ఇచ్చిన ఆఫర్‌ని మీరు సద్వినియోగం చేసుకోండి.
blockquote class="twitter-tweet" data-cards="hidden" data-lang="en">We are, where you are! Mahanati, known for her benevolence and compassion is back to spread love... If you want to watch #Mahanati at your old age home and celebrate Savitri, do write to us at
[email protected] pic.twitter.com/EobBSr73Bn
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) May 21, 2018