మ‌హాన‌టి చిత్ర షూటింగ్ పూర్తి.. మే 9న విడుద‌ల‌

Thu,March 22, 2018 11:50 AM
mahanati shoot wrapped up

అప్ప‌టి అందాల తార సావిత్రి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన చిత్రం మ‌హాన‌టి. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ బుధ‌వారంతో పూర్తైంది. ఈ నేప‌థ్యంలో చిత్ర యూనిట్ సావిత్రి ఫోటోకి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. మే 9న తెలుగు, త‌మిళ భాష‌ల‌లో మ‌హాన‌టి చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సి. అశ్వినీదత్ సమర్పణలో వైజ‌యంతి సినిమా పతాకంపై స్వప్నా దత్ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతుంది. సావిత్రి పాత్ర‌లో కీర్తి సురేష్ న‌టించ‌గా, జ‌ర్నలిస్ట్ మ‌ధుర‌వాణిగా స‌మంత‌, జెమినీ గ‌ణేష‌న్ పాత్ర‌లో దుల్క‌ర్ స‌ల్మాన్ క‌నిపించ‌నున్నారు. షాలిని పాండే, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మోహ‌న్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. సావిత్రి చివ‌రి రోజుల‌లో అనుభ‌వించిన దుర్భ‌ర జీవితాన్ని సినిమాలో చూపించ‌ర‌ని తెలుస్తుంది. మిక్కీ జేయ‌ర్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. త‌మిళంలో ‘నడిగర్‌ తిలగమ్‌’ అనే టైటిల్ తో ఈ మూవీ విడుద‌ల కానుంది.1829
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS