మెల్‌బోర్న్ ఫెస్టివ‌ల్‌కి సావిత్రి బ‌యోపిక్‌

Tue,July 17, 2018 11:20 AM
mahanati selected for melbourne film festival

అల‌నాటి అందాల న‌టి సావిత్రి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన మ‌హాన‌టి చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన ఈ చిత్రానికి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ల‌భించాయి. చిత్రంలో సావిత్రి పాత్రిని కీర్తి సురేష్ పోషించ‌గా, జ‌ర్నలిస్ట్ మ‌ధుర‌వాణిగా స‌మంత న‌టించింది. సావిత్రి భ‌ర్త జెమినీ గ‌ణేష‌న్ పాత్ర‌లో దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టించారు. విజ‌య్ దేవ‌రకొండ‌, షాలిని పాండే, మోహ‌న్ బాబు, అవ‌స‌రాల శ్రీనివాస్, ప్ర‌కాశ్ రాజ్‌, క్రిష్ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషించారు. అయితే ఎంద‌రో ప్రేక్ష‌కుల మన‌సులు గెలుచుకున్న ఈ చిత్రం ఇండియన్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌‌కు నామినేట్‌ అయ్యింది. నాగ్ అశ్విన్ ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటి కేటగిరీల్లో త‌మ చిత్రం ఎంపికైనందుకు గ‌ర్వంగా ఉంద‌ని నాగ్ అశ్విన్ అన్నాడు. మెల్ బోర్న్ ఫెస్టివల్‌లో భాగంగా ఉత్తమ నటి కేటగిరీలో దీపిక పదుకొణె(పద్మావత్‌), ఆలియా భట్‌(రాజీ), రాణీ ముఖర్జీ(హిచ్‌కీ), విద్యా బాలన్‌(తుమ్హారీ సులు)లతో కీర్తి సురేశ్‌ పోటీ పడనున్నారు. ఉత్తమ సహాయ నటుల పాత్రల్లో విక్కీ కౌశల్‌(సంజు), రిచా చద్దా(లవ్‌ సోనియా)లతో సమంత పోటీ పడనున్నారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఆగస్టు 10 నుంచి ఈ ఫెస్టివల్‌ ప్రారంభం కానుంది. మ‌హానటి చిత్రాన్ని వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్విని దత్‌, స్వప్న దత్‌, ప్రియాంక దత్‌ నిర్మించారు. మిక్కీ జే మేయర్‌ బాణీలు అందించిన సంగ‌తి తెలిసిందే.

1246
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles