షాంగై ఫిలిం ఫెస్టివ‌ల్‌కి ఎంపిక అయిన మ‌హాన‌టి

Sat,May 4, 2019 10:09 AM
Mahanati selected for a international film fest

గ‌త ఏడాది విడుద‌లైన మ‌హాన‌టి చిత్రం సావిత్రి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొంద‌డ‌మే కాక‌, బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ వ‌సూళ్ళు రాబ‌ట్టింది. కీర్తి సురేష్ న‌ట‌న‌కి ప్రేక్ష‌కులు జేజేలు ప‌లికారు. మ‌హాన‌టి చిత్రం ఇప్ప‌టికే ఎన్నో ఘ‌న‌త‌లు సాధించ‌గా, తాజాగా మ‌రో ఘ‌న‌త ఈ మూవీ లిస్ట్‌లో చేరింది. చైనాలోని షాంగై లో జూన్ 15నుండి 24 వరకు 22వ షాంగై ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ జ‌ర‌గ‌నుండ‌గా, ఇందులో ఈ చిత్రాన్ని ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. షాంగైలో ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతున్న తొలి ఇండియ‌న్ సినిమాగా మ‌హాన‌టి అరుదైన ఘ‌న‌త సాధించింది.ఈ నేప‌థ్యంలో చిత్ర యూనిట్ ఆనందానికి అవ‌ధులు లేవు. కాగా, ఈ చిత్రంలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ , సమంత , విజయ్ దేవరకొండ, రాజేంద్ర ప్ర‌సాద్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించింది.



1275
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles