'మహానటి' సెకండ్ సింగిల్ సాంగ్ కి టైం ఫిక్స్

Wed,April 25, 2018 04:22 PM
Mahanati second single released on april 26

అలనాటి అందాల నటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం మహానటి. కీర్తిసురేష్ కథానాయికగా నటిస్తున్నది. నాగ అశ్విన్ దర్శకుడు. ప్రియాంకదత్ నిర్మాత. సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ కీలక పాత్రధారులు. ఈ సినిమాలో మూగమనసులు.. అనే లిరికల్ గీతాన్ని ఇటీవల చిత్రబృందం విడుదలచేసింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని అందించిన ఈ గీతానికి మిక్కీ జే మేయర్ స్వరాలను సమకూర్చారు. ఈ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక రెండో పాటని రేపు సాయంత్రం 5గం.లకి విడుదల చేయనున్నారు. సదా నన్ను అంటూ సాగే ఈ పాటకి కూడా సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ అందించారు. చారులత మణి ఈ పాట పాడారు. పీరియాడిక్ బయోపిక్ గా రూపొందిన మహానటి చిత్రంలో సావిత్రి సినీ, వ్యక్తిగత జీవితంలో కీలక ఘట్టాలను చూపించనున్నారు. ఇటీవల విడుదలైన టీజర్, కీర్తిసురేష్, సమంత ఫస్ట్ లుక్ లకి చక్కటి స్పందన లభిస్తున్నది. మే 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు.

1760
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS