భారీ టీఆర్‌పీ రేటింగ్ సాధించిన మ‌హాన‌టి

Thu,August 30, 2018 01:13 PM

తెలుగులో తొలి బ‌యోపిక్‌గా రూపొంది సంచ‌ల‌న విజ‌యం సాధించిన చిత్రం మ‌హాన‌టి. అభిన‌వ నేత్రి సావిత్రి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో కీర్తి సురేష్‌, స‌మంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, దుల్క‌ర్ స‌ల్మాన్‌, రాజేంద్ర ప్ర‌సాద్ ,షాలిని పాండే, అవ‌స‌రాల శ్రీనివాస్‌ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషించారు. మిక్కీ జే మేయ‌ర్ చిత్రానికి సంగీతం అందించారు. వైజ‌యంతి మూవీస్ బేన‌ర్‌పై ప్రియాంక ద‌త్‌, స్వ‌ప్నా ద‌త్ నిర్మాణంలో ఈ మూవీ రూపొందింది. మ‌హిళ జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం భారీ విజ‌యం సాధించి ఔరా అనిపించింది. మే 9న విడుద‌లైన మ‌హాన‌టి మూవీ ఇటీవ‌ల‌ వంద రోజుల లాంగ్ జ‌ర్నీని పూర్తి చేసుకుంది. అయితే గ‌త వారం( ఆగ‌స్ట్ 19న‌) బుల్లితెర‌పై ప్ర‌సారం అయింది మ‌హాన‌టి మూవీ. వెండితెర‌పై సంచ‌ల‌నం సృష్టించిన ఈ చిత్రం బుల్లితెర‌పై కూడా రికార్డు స్థాయిలో టీఆర్‌పీ సాధించి ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. తాజా స‌మాచారం ప్ర‌కారం మ‌హాన‌టి మూవీ 20.16 టీఆర్‌పీ సాధించిందని చెబుతున్నారు. బాహుబ‌లి త‌ర్వాత అత్య‌ధిక టీఆర్‌పీ రేటింగ్ సాధించిన చిత్రంగా మ‌గ‌ధీర (22.0), బాహుబ‌లి (21.84), ఫిదా (21.30), శ్రీమంతుడు (21.24) ఉన్నాయి. వీటి త‌ర్వాతి స్థానం మ‌హాన‌టికే ద‌క్కింద‌ని అంటున్నారు.

5067
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles