HomeLATEST NEWSMahanati Movie Making video

మహాన‌టి మూవీ మేకింగ్ వీడియో

Published: Wed,May 2, 2018 08:33 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   
ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మ‌చ్ ఎవైటెడ్ మూవీ మ‌హాన‌టి. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో అలనాటి అందాల నటి సావిత్రి జీవిత నేప‌థ్యంతో తెర‌కెక్కిన ఈ చిత్రం మే 9న విడుద‌ల కానుంది. నిన్న ఈ మూవీ ఆడియో వేడుక గ్రాండ్‌గా జ‌రిగింది. జూనియ‌ర్ ఎన్టీఆర్‌, నాగార్జున, నాని, శేఖ‌ర్ క‌మ్ముల త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మానికి గెస్ట్‌గా హాజ‌ర‌య్యారు. సావిత్రి గురించి మాట్లాడుతూ.. మ‌హాన‌టి గురించి ఎంత చెప్పిన త‌క్కువే అంటూ వారికి ఆమెపై ఉన్న ప్రేమ‌ని క‌న‌బ‌రచారు. చిత్రంలో స‌మంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, దుల్క‌ర్ స‌ల్మాన్, రాజేంద్ర ప్రసాద్, ప్రకాశ్‌ రాజ్, షాలిని పాండే, మాళవికా నాయర్, భానుప్రియ, దివ్యవాణి, శ్రీనివాస్ అవసరాల, దర్శకుడు క్రిష్, తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్ర‌లు పోషించ‌గా, ప్రియాంక ద‌త్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని టీం చెబుతుంది. ఇక ఆడియో వేడుకలో భాగంగా మేకింగ్ వీడియో విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఈ వీడియో ప్ర‌తి ఒక్క‌రిని అల‌రిస్తుంది. మిక్కీ జే మేయ‌ర్ చిత్రానికి స్వ‌రాలు స‌మ‌కూర్చారు. పీరియాడిక్ బయోపిక్ గా రూపొందిన మహానటి చిత్రంలో సావిత్రి సినీ, వ్యక్తిగత జీవితంలో కీలక ఘట్టాలను చూపించనున్నారు.



2310
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology